Haridwar: ముగిసిన కుంభమేళా... హరిద్వార్ లో కర్ఫ్యూ విధింపు!

Curfew in Haridwar after Kumbhamela

  • నిన్న జరిగిన చివరి షాహీ స్నాన్
  • కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో
  • కరోనాను కట్టడి చేస్తామన్న అధికారులు

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళా, చివరి షాహీ స్నాన్ తో ముగిసింది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఏ ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు ఆ ప్రాంతానికి తక్షణమే వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. ఈ మెగా కుంభమేళాలో కరోనా నిబంధనలను పాటించలేదని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. హరిద్వార్ తో పాటు రూర్కే, లక్సర్, భగవాన్ పూర్ తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలవుతుందని, కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని హరిద్వార్ జిల్లా కలెక్టర్ తెలిపారు.

కుంభమేళాలో భాగంగా చివరి షాహీ స్నాన్ ను భక్తులు లేకుండా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరినా, మిశ్రమ స్పందనే లభించింది. స్వామి అవదేశానంద గిరి కుంభమేళా ముగిసిందని రెండు వారాల క్రితమే ప్రకటించినా భక్తులు పట్టించుకోలేదు. వేలాది మంది మంగళవారం నాడు పుణ్యస్నానాలు ఆచరించారు. మార్చి 3వ తేదీన కేవలం 451 రోజువారీ కేసులను నమోదు చేసిన ఉత్తరాఖండ్, ఇప్పుడు రోజుకు 39 వేల కొత్త కేసులను నమోదు చేస్తోంది. కుంభమేళా ముగిసిన నేపథ్యంలో కర్ఫ్యూ నిబంధనలను పక్కాగా అమలు చేయడం ద్వారా కేసులను కట్టడి చేస్తామన్న నమ్మకం ఉందని ఉత్తరాఖండ్ అధికారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News