Samsung: ఒక్క ఫ్యామిలీ.. రూ.80,357 కోట్ల పన్నులు!

Samsung Heirs to pay Rs 80000 crore as Heritage tax to South Korea

  • దక్షిణ కొరియా ప్రభుత్వానికి చెల్లించనున్న శాంసంగ్ చైర్మన్ కుటుంబం
  • వారసత్వ పన్నుగా చెల్లించాలని నిర్ణయం
  • ఐదేళ్లలో ఆరు విడుతలుగా కట్టేందుకు చర్యలు
  • ఇప్పటికే ఒక విడత చెల్లింపులు
  • సంస్థ చైర్మన్ సేకరించిన కళాఖండాలూ ప్రభుత్వానికి
  • పిల్లల జబ్బులపై పరిశోధనల కోసం 90 కోట్ల డాలర్లు విరాళం

ఒక్క ఫ్యామిలీ.. ఒకే ఒక్క ఫ్యామిలీ.. ప్రభుత్వానికి రూ.80,357 కోట్ల పన్నులను కట్టనుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక వారసత్వ పన్నులు కట్టిన కుటుంబంగా చరిత్ర సృష్టించనుంది. ఆ ఫ్యామిలీ వేరెవరో కాదు.. శాంసంగ్ సంస్థల అధిపతులు. సంస్థ మాజీ చైర్మన్ లీ కున్ హీ కుటుంబం ఆ పన్నును చెల్లించాలని నిర్ణయించింది.


వారసత్వ పన్నులో భాగంగా 1,080 కోట్ల డాలర్లను దక్షిణ కొరియా ప్రభుత్వానికి చెల్లించనుంది. గత ఏడాది లీ కున్ హీ చనిపోవడంతో.. ఆయన సంపదలోని సగ భాగాన్ని వారసత్వ పన్నుగా చెల్లించాలని ఆయన భార్యాపిల్లలు నిర్ణయించినట్టు శాంసంగ్ ఈరోజు ప్రకటించింది.

రాబోయే ఐదేళ్లలో మొత్తం ఆరు విడతలుగా ఆ మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించిన లీ కుటుంబం.. ఈ నెలలోనే తొలి చెల్లింపు చేసింది. చెల్లింపుల్లో భాగంగా లీ కూడబెట్టిన 23 వేల కళాఖండాలను ప్రభుత్వానికి అందించనుంది. తద్వారా పన్ను కోసం డబ్బు చెల్లింపులను తగ్గించుకోవాలని చూస్తోంది.

కళాఖండాల్లో నేషనల్ ట్రెజర్స్, పెయింటింగ్స్ ను ఇవ్వనుంది. వాటితో పాటు 90 కోట్ల డాలర్లను కేన్సర్, ఇతర అరుదైన జబ్బులతో బాధపడే పిల్లల చికిత్సకు సంబంధించిన పరిశోధనల కోసం విరాళంగా ఇవ్వనుంది. ఆ దేశంలో గతేడాది వసూలైన ఎస్టేట్ పన్నుల ఆదాయంకన్నా శాంసంగ్ కట్టనున్న వారసత్వ పన్నులు మూడు రెట్లు ఎక్కువ.

  • Loading...

More Telugu News