Somireddy Chandra Mohan Reddy: పరీక్షలపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది: సోమిరెడ్డి
- విద్యార్థుల పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం పంతానికి పోకూడదు
- కరోనా బారినపడకుండా ప్రభుత్వం కాపాడగలదా?
- కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో చికిత్స, ఔషధాలపై దృష్టి పెట్టట్లేదు
- విద్యార్థులకు పరీక్షలు పెట్టడంపైనే దృష్టి
విద్యార్థుల పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం పంతానికి పోకూడదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. వారు కరోనా బారినపడకుండా ప్రభుత్వం కాపాడగలదా? అని ఆయన నిలదీశారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని ఆయన చెప్పారు.
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో చికిత్స, ఔషధాలు, ఆసుపత్రుల్లో సౌకర్యాలపై దృష్టి పెట్టకుండా వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు పరీక్షలు పెడతామనడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాదిన్నర వయసున్న చిన్నారిని కూడా ప్రభుత్వం కాపాడలేకపోయిందని ఆయన విమర్శించారు.
ఇక లక్షలమంది విద్యార్థులను కాపాడుతుందా? అని ఆయన నిలదీశారు. కరోనా మహమ్మారి దేశాల అధ్యక్షులనే వదలట్లేదని చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పలు పరీక్షలను రద్దు చేసిందని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం మాత్రం మొండితనానికి పోతుందని విమర్శించారు.