Nitin Menon: కరోనా ఎఫెక్ట్... కుటుంబం కోసం ఐపీఎల్ నుంచి తప్పుకున్న అంపైర్

Umpire Nitin Menon left IPL to be with corona infected family members

  • భారత్ లో కరోనా కల్లోలం
  • ఐపీఎల్ పైనా కరోనా ప్రభావం
  • ఇప్పటికే పలువురు ఆటగాళ్లు తప్పుకున్న వైనం
  • అదే బాటలో అంపైర్ నితిన్ మీనన్
  • నితిన్ మీనన్ తల్లి, భార్యకు కరోనా పాజిటివ్

భారత్ లో కరోనా సంక్షోభం నెలకొన్నప్పటికీ ఐపీఎల్ టోర్నీ మాత్రం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అయితే కరోనా నేపథ్యంలో కొందరు ఆటగాళ్లు టోర్నీ నుంచి తప్పుకోవడం తెలిసిందే. అశ్విన్ తన కుటుంబ సభ్యులు కరోనా బారినపడడంతో టోర్నీ నుంచి వైదొలగగా... కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా, ఆండ్రూ టై వంటి ఆస్ట్రేలియా ఆటగాళ్లు టోర్నీ మధ్యలోనే స్వదేశం బయల్దేరారు. ఈ నేపథ్యంలో, ఆటగాళ్లే కాదు, ఓ అంపైర్ కూడా కరోనా ఎఫెక్ట్ తో ఐపీఎల్ కు దూరమయ్యాడు.

భారత్ లో జరిగే సిరీస్ లతో పాటు ఐపీఎల్ లోనూ విధులు నిర్వర్తించే నితిన్ మీనన్ తన కుటుంబ సభ్యుల కోసం టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. నితిన్ మీనన్ తల్లి, భార్య ఇద్దరూ కరోనా బారినపడ్డారు. వారికి పాజిటివ్ రావడంతో, ఈ కష్ట సమయంలో తాను కుటుంబం చెంతన ఉండాలని అంపైర్ నితిన్ మీనన్ నిర్ణయించుకున్నాడు. అందుకే ఐపీఎల్ బయో బబుల్ నుంచి వైదొలగుతున్నట్టు వెల్లడించాడు. ప్రస్తుతం తాను ఆసుపత్రి వద్ద తన కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటున్నానని తెలిపాడు.

  • Loading...

More Telugu News