Exit Polls: తిరుపతి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించిన ఆరా సంస్థ... వైసీపీకి ఎంత శాతం అంటే..!

Exit Poll results of Tirupati Lok Sabha by elections
  • ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్
  • మే 2న ఓట్ల లెక్కింపు
  • ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఆరా సంస్థ
  • వైసీపీకి అత్యధిక శాతం ఓటింగ్
  • రెండో స్థానంలో టీడీపీ
దేశంలో నాలుగు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అటు దేశంలోని పలు ప్రాంతాల్లో లోక్ సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలు కూడా నిర్వహించారు. నేడు పశ్చిమ బెంగాల్ లో చివరి విడత పోలింగ్ ముగియడంతో దేశవ్యాప్త ఎన్నికల కోలాహలం పరిసమాప్తమైంది. ఈ నేపథ్యంలో, ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ను ఆరా సంస్థ వెల్లడించింది.

ఈ ఎన్నికలో అత్యధికంగా వైసీపీకి 65.85 శాతం ఓట్లు వచ్చినట్టు ఆరా అంచనా వేసింది. అదే సమయంలో టీడీపీకి 23.10 శాతం, బీజేపీ-జనసేన కూటమికి 7.34 శాతం, ఇతరులకు 3.71 శాతం ఓట్లు వచ్చినట్టు పేర్కొంది. ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
Exit Polls
Tirupati LS Bypolls
YSRCP
TDP
BJP-Janasena

More Telugu News