Banks: ఈ నెలలో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు

Banks to remain closed for 12 days in May

  • సెలవుల జాబితాను విడుదల చేసిన ఆర్‌బీఐ
  • బ్యాంకులు మూతపడినా ఆన్‌లైన్ సేవలు యథాతథం
  • సాధారణ సెలవులు పోను 5 రోజుల సెలవులు

ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ నెలలో 12 రోజులపాటు మూతపడనున్నాయి. ఈ మేరకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. 12 సెలవుల్లో ఐదు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారం సాధారణ సెలవులు కాగా, నేడు కార్మిక దినోత్సవం సందర్భంగా సెలవు.

ఈ నెల 7న జమాతుల్ విదా సందర్భంగా సెలవు ప్రకటించగా, 13న రంజాన్ సెలవు.  14న భగవాన్ శ్రీ పరశురాం జయంతి, బసవ జయంతి, అక్షర తృతీయ సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి. 26న బుద్ధపూర్ణిమ సందర్భంగా ఆర్‌బీఐ సెలవు ప్రకటించింది. బ్యాంకులు మూతపడినప్పటికీ ఆన్‌లైన్ సేవలకు ఎలాంటి అంతరాయమూ ఉండదని రిజర్వు బ్యాంకు పేర్కొంది.

  • Loading...

More Telugu News