Tirupati LS Bypolls: తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి
- ఈ నెల 17న పోలింగ్
- రేపు ఓట్ల లెక్కింపు
- తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో కౌంటింగ్
- అధికారులకు, ఏజెంట్లకు కరోనా పరీక్షలు
- కరోనా నెగెటివ్ వస్తేనే లోపలికి అనుమతి
- మధ్యాహ్యానికల్లా ఫలితం వెల్లడయ్యే అవకాశం
ఈ నెల 17న తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించగా, రేపు ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. అందుకోసం తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ అధికారులకు, ఏజెంట్లకు కరోనా పరీక్షలు చేశారు. నెగెటివ్ రిపోర్టు వచ్చినవారినే కౌంటింగ్ కేంద్రం లోపలికి అనుమతించనున్నారు.
రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, ఆపై ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు. ఒక్క తిరుపతి సెగ్మెంట్ కోసమే 4 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 6 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు. రేపు మధ్యాహ్నం కల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా, కరోనా తీవ్రత దృష్ట్యా విజయోత్సవ వేడుకలు, ర్యాలీలపై నిషేధం విధించారు.