Alla Nani: 104 కాల్ సెంటర్ ను సీఎం జగన్ అత్యంత కీలకంగా భావిస్తున్నారు: ఆళ్ల నాని
- సెకండ్ వేవ్ ను తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది
- 104 కాల్ సెంటర్లు 24 గంటలు పని చేయాలి
- ఒడిశా నుంచి ఆక్సిజన్ ను తెప్పిస్తున్నాం
కరోనా సెకండ్ వేవ్ ను సాధ్యమైనంత త్వరగా తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టిందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 420 కొవిడ్ ఆసుపత్రులు, ఐసీయూ బెడ్స్ 5,601... ఆక్సిజన్ బెడ్స్ 18,992 ఉన్నాయని చెప్పారు. 3,120 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 104 కాల్ సెంటర్ ను సీఎం జగన్ అత్యంత కీలకమైన వ్యవస్థగా భావిస్తున్నారని చెప్పారు. 104 కాల్ సెంటర్ 24 గంటలు పని చేయాలని ఆదేశించారు.
ఆసుపత్రుల్లో బెడ్లు పెంచడంపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించాలని ఆళ్ల నాని చెప్పారు. కొవిడ్ ఆసుపత్రుల్లోని పేషెంట్ల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలను తెలుసుకునే ప్రయత్నాన్ని మెడికల్ ఆఫీసర్లు చేయాలని ఆదేశించారు. ఒడిశా నుంచి 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు.