MHA: బెంగాల్‌లో హింస.. నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ

MHA Sought report on post poll alliance in bengal

  • ఫలితాల అనంతరం పలు చోట్ల హింసాత్మక ఘటనలు
  • ఆరుగురు కార్యకర్తలు మరణించారని బీజేపీ ఆరోపణ
  • ఇళ్లు, కార్యాలయాలనూ ధ్వంసం చేశారని ఆరోపణ
  • తృణమూల్‌ దౌర్జన్యంగా వ్యవహరించిందని విమర్శ
  • నివేదిక ఇవ్వాలని ఆదేశించిన గవర్నర్‌

బెంగాల్‌లో ఆదివారం అసెంబ్లీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి బీజేపీకి చెందిన కనీసం ఆరుగురు కార్యకర్తలు మరణించారని ఆ పార్టీ రాష్ట్ర శాఖ ఆరోపించింది. అలాగే కొన్ని వందల పార్టీ కార్యాలయాలు, ఇళ్లను ధ్వంసం చేశారని తెలిపింది. ఫలితాలు తృణమూల్‌కు అనుకూలంగా మారుతున్న కొద్దీ బీజేపీ కార్యకర్తలపై తృణమూల్‌ దౌర్జన్యం పెరిగిపోయిందని ఆరోపించింది.

ఈ ఆరోపణలపై కేంద్ర హోంశాఖ స్పందించింది. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బెంగాల్‌ ఫలితాల తర్వాత హింసకు సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

మరోవైపు ఆ రాష్ట్ర గవర్నర్‌ సైతం దీనిపై స్పందించారు. ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ, కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. బెంగాల్‌లో 292 స్థానాలకు ఎన్నికలు జరగగా  213 సీట్లలో తృణమూల్‌, బీజేపీ 77, లెఫ్ట్‌-కాంగ్రెస్‌ 1, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందాయి.

  • Loading...

More Telugu News