Rahul Gandhi: దేశంలో కరోనా కట్టడికి సంపూర్ణ లాక్ డౌన్ ఒక్కటే మార్గం: రాహుల్ గాంధీ
- దేశంలో ఉద్ధృతంగా కరోనా వ్యాప్తి
- నేడు 3.57 లక్షల కొత్త కేసుల వెల్లడి
- పరిస్థితిని కేంద్రం అర్థం చేసుకోవడంలేదన్న రాహుల్
- నిర్లక్ష్య వైఖరితో అమాయకులను చంపేస్తున్నారని వ్యాఖ్యలు
దేశంలో ఇవాళ కూడా 3 లక్షలకు పైగా కరోనా కేసులు వెల్లడైన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి తీవ్రతను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అర్థం చేసుకోవడంలేదని విచారం వెలిబుచ్చారు. దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే ఇప్పుడు సంపూర్ణ లాక్ డౌన్ విధించడం ఒక్కటే మార్గమని రాహుల్ స్పష్టం చేశారు.
అదే సమయంలో, లాక్ డౌన్ తో ప్రభావితమయ్యే వర్గాలను 'న్యాయ్' పథకం కిందకు తీసుకురావాలని సూచించారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరి అనేకమంది అమాయక ప్రజలను చంపేస్తోందని విమర్శించారు.