Asaduddin Owaisi: పశ్చిమ బెంగాల్‌లో హింసపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
- ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంటుంది
- ఇది పౌరుడి ప్రాథమిక హక్కు
- ప్రజల ప్రాణాలను కాపాడడం ప్రభుత్వ తొలి బాధ్యత
- ఇటువంటి ఘటనలు ఎక్కడ జరిగినా ఖండిస్తాం
పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం కూడా బీజేపీ కార్యాలయాలపై టీఎంసీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని బీజేపీ అంటోంది. బెంగాల్‌లో హింసపై విమర్శలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం కూడా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.
పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకున్న హింసపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంటుందని, ఇది పౌరుడి ప్రాథమిక హక్కని ఆయన చెప్పారు. ప్రజల ప్రాణాలను కాపాడడం ప్రభుత్వ తొలి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ బాధ్యతను నిర్వర్తించలేని ప్రభుత్వం ప్రాథమిక బాధ్యతలను నిర్వహించడంలో విఫలమైనట్లేనని చెప్పారు. భారత్‌లో ఇటువంటి ఘటనలు ఎక్కడ జరిగినా తమ పార్టీ ఖండిస్తుందని ఆయన చెప్పారు.