Sensex: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 465 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 137 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 2.26 శాతం పతనమైన డాక్టర్ రెడ్డీస్ షేర్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి లాభాల్లో కొనసాగిన మార్కెట్లు ట్రేడింగ్ చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గుచూడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 465 పాయింట్లు కోల్పోయి 48,253కి పడిపోయింది. నిఫ్టీ 137 పాయింట్లు పతనమై 14,496కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (1.86%), బజాజ్ ఫైనాన్స్ (1.12%), టీసీఎస్ (0.39%), నెస్లే ఇండియా (0.34%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (0.33%).
టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-2.26%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.18%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.74%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్(-1.73%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.61%).