Corona Virus: ఎన్‌440కే వేరియంట్‌ 15 రెట్లు ప్రాణాంతకం: స్పష్టం చేసిన నిపుణులు

Corona n440k 15 times more dnagerous than previous ones

  • తొలిసారి దక్షిణాదిలో వెలుగులోకి వచ్చిన ఎన్‌440కే
  • తొలివేవ్‌ ఉన్న సమయంలోనే గుర్తించిన సీసీఎంబీ
  • క్రమంగా డబుల్‌ మ్యూటెంట్ల స్థానాన్ని చేరుతున్నట్టు గుర్తింపు
  • రూపాంతరం చెందుతున్న ఆనవాళ్లూ లేవన్న నిపుణులు

రోజులు గడుస్తున్న కొద్దీ పుట్టుకొస్తున్న కరోనా కొత్త రకాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే రెండో దశతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌లో పలు చోట్ల ఎన్‌440కే అనే రకం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి దీన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు దక్షిణాదిలో తొలి వేవ్‌ తగ్గుముఖం పడుతున్న తరుణంలోనే కనుగొన్నారు. అయితే, ఇది ప్రస్తుతం మరింత రూపాంతరం చెందుతున్న ఆనవాళ్లు లేవని పరిశోధకులు తెలిపారు.

ఎన్‌440కే వేరియంట్‌ గతంలో వెలుగులోకి వచ్చిన వాటితో పోలిస్తే 15 రెట్లు ప్రాణాంతకమైందని నిపుణులు తెలిపారు. రెండో దశలో ప్రబల రూపకంగా ఉన్న డబుల్‌ మ్యూటెంట్‌ రకాలైన బీ1.617, బీ1.618 కంటే కూడా ఎన్‌440కే బలమైందని తెలిపారు. తొలి వేవ్‌ ఉనికిలో ఉన్న సమయంలో ఎన్‌440కే ఆందోళన కలిగించిందని.. కానీ, అది క్రమంగా తాజా డబుల్‌ మ్యూటెంట్ల స్థానాన్ని చేరుతోందని తెలిపారు.

  • Loading...

More Telugu News