Subramanian Swamy: పీఎంవోపై ఆధారపడటం వేస్ట్.. ఆ ప‌ని గ‌డ్క‌రీకి అప్ప‌గించండి: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి

Depending upon PMO is waste says Subramanin Swamy
  • కరోనా బాధ్యతలపై పీఎంవోపై ఆధారపడటం వేస్ట్
  • నేను ప్రధానిని విమర్శించడం లేదు
  • కరోనా బాధ్యతలను గడ్కరీకి అప్పగించాలి
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామికి ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉంది. పలువురు కీలక నేతలపై ఆయన కోర్టుల్లో పిటిషన్లు వేసి చుక్కలు చూపించారు. ఆయన దెబ్బకు కటకటాలు లెక్కపెట్టిన వారిలో జయలలిత ఒకరు. మరోవైపు, తన సొంత పార్టీపై విమర్శలు గుప్పించడానికి ఆయన వెనుకాడటం లేదు.

ఈరోజు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా బాధ్యతల నిర్వహణకు సంబంధించి ప్రధాని కార్యాలయంపై ఆధారపడటం అనవసరమని.. ఆ బాధ్యతలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అప్పగించాలని చెప్పారు. పీఎంఓపై ఆధారపడటం దండగని అన్నారు.

అయితే, ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి ఒక కీలక వ్యాఖ్య చేశారు. తాను కేవలం ప్రధాని కార్యాలయాన్నే విమర్శిస్తున్నానని... ప్రధాని మోదీని కాదని వివరణ ఇచ్చారు. కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కు కూడా పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదని అన్నారు. హర్షవర్ధన్ తన అధికారాలను పూర్తి స్థాయిలో నిర్వహించలేని పరిస్థితి ఉందని చెప్పారు. గడ్కరీతో కలిస్తే హర్షవర్ధన్ విజయవంతమవుతారని అన్నారు.  

మన దేశం మరో కరోనా వేవ్ ను ఎదుర్కోబోతోందని స్వామి హెచ్చరించారు. ఈ వేవ్ పిల్లలపై కూడా ప్రభావం చూపుతోందని... ప్రతి ఒక్కరు కట్టుదిట్టమైన జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు.  
Subramanian Swamy
modi
Nitin Gadkari
BJP
PMO

More Telugu News