Telangana: తెలంగాణలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉండదు కానీ.. : ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

there is no lockdown in telangana says somesh kumar
  • రాష్ట్రంలో వైరస్ పూర్తిస్థాయిలో అదుపులో ఉంది
  • లాక్‌డౌన్ వల్ల ప్రజల జీవనోపాధి దెబ్బతింటుంది
  • లాక్‌డౌన్ కంటే ప్రజలకు మెరుగైన చికిత్స అందించడం ముఖ్యం
  • వారాంతపు లాక్‌డౌన్ గురించి ఆలోచిస్తున్నామన్న సీఎస్  
రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించబోవడం లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. అయితే, వారాంతపు లాక్‌డౌన్ విషయం గురించి మాత్రం ఆలోచిస్తున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్ విధించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదన్నారు. లాక్‌డౌన్ విధించి ప్రజలను ఇబ్బంది పెట్టడం కంటే, వారికి మంచి చికిత్స అందించడం ఎంతో ముఖ్యమన్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులో ఉందని, అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించడంపై సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు ఆ నిర్ణయం తీసుకున్నాయన్నారు. లాక్‌డౌన్ వల్ల ప్రజలు జీవనోపాధిని కోల్పోతారన్నారు. అయితే, రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అవసరమైనప్పుడు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన నిర్ణయం తీసుకుంటారని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.
Telangana
Lockdown
Somesh Kumar

More Telugu News