Cricket: టీ20 లీగ్‌లు ఒప్పుకోవడానికి ముందు కాస్త హోంవర్క్‌ చేయండి: ఐపీఎల్‌ రద్దు నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఆ దేశ బోర్డు చురకలు

Do some homework before signing t20 leagues in other countries australia borad to its players

  • ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ
  • భారత్‌లో ఐపీఎల్‌ రద్దు
  • ప్రయాణ ఆంక్షలతో ఇక్కడే చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు
  • లీగ్‌లపై సంతకాలు చేసే ముందు ఆలోచించాలని ఏసీఏ సూచన

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇతర దేశాల్లో జరిగే టీ20 లీగ్‌లపై సంతకం చేయడానికి ముందు కాస్త హోంవర్క్‌ చేయాలంటూ ఆస్ట్రేలియా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టాడ్‌ గ్రీన్‌బెర్గ్‌ ఆ దేశ ఆటగాళ్లకు చురకలంటించారు. భారత్‌లో ఐపీఎల్‌ రద్దయిన నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లీగ్‌లో పాల్గొంటున్న పలు జట్ల ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో బీసీసీఐ ఐపీఎల్‌ను రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకుంది.

అయితే, ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై మే 15 వరకు నిషేధం విధించింది. దీంతో ఐపీఎల్‌లో పాల్గొనడానికి వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇక్కడే చిక్కుకుపోయారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో పలువురు ఆటగాళ్లు ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే టాడ్‌ గ్రీన్‌బెర్గ్‌ స్పందించారు.

ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడి, ఆందోళనలో ఉండే అవకాశం ఉందని గ్రీన్‌బెర్గ్‌ అన్నారు. వారు ఆస్ట్రేలియాకు తిరిగి రాగానే కచ్చితంగా కావాల్సిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News