Goa: గోవాలో కరోనా విలయం.. పరీక్షలు నిర్వహించిన ప్రతి ఇద్దరిలో ఒకరు ‘పాజిటివ్’

One in Every Two infected to corona virus in Goa

  • 48 శాతం పాజిటివిటీ రేటుతో దేశంలోనే అగ్రస్థానం
  • రెండో స్థానంలో హర్యానా
  • లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమంటున్న నిపుణులు

గోవాలో కరోనా విలయతాండవం చేస్తోంది. పాజిటివిటీ రేటులో దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఈ రాష్ట్రంలో వైరస్ విజృంభణ తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ఇక్కడ పరీక్షలు నిర్వహించిన ప్రతి ఇద్దరిలో ఒకరు పాజిటివ్‌గా తేలడం ఆందోళనకు గురిచేస్తోంది. గత నెలతో పోలిస్తే ఇక్కడ కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఏప్రిల్‌లో ఇక్కడ కరోనా పాజిటివిటీ రేటు 40 నుంచి 51 శాతంగా ఉంది. ఇప్పుడది 48 శాతం వుంది.

పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా తర్వాత హర్యానా రెండోస్థానంలో ఉంది. ఇక్కడ పాజిటివిటీ రేటు 37 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గోవాలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్‌కు అడ్డుకట్ట వేయాలంటే పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. అలాగే, పర్యాటకాన్ని కూడా కొంతకాలం మూసివేయడం మేలని అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News