Himachal Pradesh: వైరస్‌కు అడ్డుకట్ట.. హిమాచల్‌ప్రదేశ్‌లో పది రోజులపాటు లాక్‌డౌన్

Himachal Pradesh Impose 10 days lockdown

  • రేపటి నుంచి 16వ తేదీ వరకు లాక్‌డౌన్
  • ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల మూసివేత
  • ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోనూ కఠిన ఆంక్షలు

రాష్ట్రంలో పెరిగిపోతున్న కొవిడ్ కేసులకు అడ్డుకట్ట వేసేందుకు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ చైన్‌ను తెగ్గొట్టేందుకు పది రోజులపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. రేపటి నుంచి 16వ తేదీ వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను పూర్తిగా మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. పదో తరగతి పరీక్షలు ఇప్పటికే రద్దు చేయడంతో ఈ నెల 31 వరకు విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించింది.

మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో నేటి నుంచి కొత్త ఆంక్షలు అమలు కానున్నాయి. మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులను 50 శాతం మాత్రమే నడపనున్నారు. నెగటివ్ రిపోర్టు లేకుండా విమానాల ద్వారా బెంగాల్‌లో అడుగుపెట్టే వారు సొంత ఖర్చుపై 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం తెలిపింది. రెండు వారాలపాటు లోకల్ రైళ్లను నిలిపివేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ తరహా ఆంక్షలను ఈ నెల 13 వరకు పొడిగిస్తున్నట్టు ఝార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News