Allu Arjun: 'పుష్ప' రెండు భాగాలుగా రానుందంటూ రూమర్!

Pushpa is going to release as two parts
  • స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ
  • ప్రతినాయకుడిగా ఫహాద్ ఫాజిల్
  • గ్రామీణ యువతిగా రష్మిక
  • నిడివి పెరగనుందంటూ టాక్  

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ 'పుష్ప' సినిమాను రూపొందిస్తున్నాడు. అడవి నుంచి ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించే నేపథ్యం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తున్న ఈ సినిమాలో, ఆయన సరసన ఆడిపాడే గ్రామీణ యువతిగా రష్మిక అలరించనుంది. ఆయన చెల్లెలి పాత్రలో ఐశ్వర్య రాజేశ్ ఆకట్టుకోనుంది. ఇక ప్రతినాయకుడి పాత్రలో ఫహాద్ ఫాజిల్ కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, ఊర్వశీ రౌతేలా ఐటమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం 35 కోట్లు ఖర్చు అయినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది.

ఉత్కంఠభరితమైన కథాకథనాలతో .. ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా నడుస్తుంది. భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. దీంతో ఈ సినిమా నిడివి పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. అయితే తాను చెప్పదలచుకున్న విషయాన్ని తగ్గించి చెప్పడం వలన ఇంపాక్ట్ పోతుందని భావించిన సుకుమార్, రెండు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. ఒక భాగాన్ని దసరాకి విడుదల చేసి, మరో భాగాన్ని వచ్చే వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నాడని అంటున్నారు.
Allu Arjun
Rashmika Mandanna
Fahad Fazil
Aishwarya Rajesh

More Telugu News