Corona Virus: దేశంలో మరో 4.14 లక్షల మందికి కరోనా నిర్ధారణ
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,14,91,598
- నిన్న 3,915 మంది మృతి
- మొత్తం మృతుల సంఖ్య 2,34,083
- 16,49,73,058 మందికి వ్యాక్సిన్లు
భారత్లో కరోనా కేసులు మరోసారి నాలుగు లక్షలకు మించి నమోదయ్యాయి. నిన్న కొత్తగా 4,14,188 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,31,507 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,14,91,598కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 3,915 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,34,083కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,76,12,351 మంది కోలుకున్నారు. 36,45,164 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 16,49,73,058 మందికి వ్యాక్సిన్లు వేశారు.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 29,86,01,699 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,26,490 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.