chicken: నెల రోజుల వ్యవధిలో రూ.100 తగ్గిన కిలో చికెన్ ధర!
- ఉత్పత్తి పెరగడంతో తగ్గుతోన్న ధరలు
- నెల రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ.270
- ప్రస్తుతం రూ.150కే
వివాహ వేడుకలు, విందులు అధికంగా ఉండే మే నెలలో చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతాయని కొంత కాలంగా నెలకొన్న అంచనాలు నిజం కాలేదు. కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో వివాహ వేడుకలు వాయిదా పడుతున్నాయి. మరోవైపు, ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
నెల రోజుల వ్యవధిలో హైదరాబాదులో కిలో కోడి మాంసం ధర రూ.100కు పైగా తగ్గడం గమనార్హం. నెల రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ.270 వరకు పెరిగింది. అయితే, ప్రస్తుతం కిలో కోడి మాంసం రూ.150కే లభిస్తోంది. ఇక లైవ్‌కోడి ధర రూ.100గా ఉంది.