Andhra Pradesh: సంగం డెయిరీని ప్ర‌భుత్వం అధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవోను నిలిపేసిన‌ హైకోర్టు!

trial in high court on sangam dairy

  • జీవోను ర‌ద్దు చేయాలంటూ సంగం డెయిరీ డైరెక్ట‌ర్ల పిటిష‌న్
  • నేడు విచార‌ణ జ‌రిపిన హైకోర్టు
  • డైరెక్ట‌ర్లు సాధార‌ణ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని వ్యాఖ్య‌
  • డెయిరీ ఆస్తులు అమ్మాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే

సంగం డెయిరీ కేసులో అరెస్టు అయిన టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఈ రోజు  కూడా విచారణ జరిగింది. విచార‌ణ‌పై స్టే ఇవ్వాల‌ని ధూళిపాళ్ల త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోరారు. డెయిరీ స‌మాచారాన్ని ప్రైవేట్ వ్య‌క్తుల‌కు పోలీసులు ఇస్తున్నార‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ధూళిపాళ్ల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో విచార‌ణ జ‌ర‌ప‌లేని ప‌రిస్థితి ఉంద‌ని సీఐడీ తెలిపింది. కాగా, క‌స్ట‌డీ పొడిగింపు అంశంపై అవినీతి నిరోధ‌క శాఖ కోర్టు విచార‌ణ జ‌ర‌పాల‌ని హైకోర్టు చెప్పింది.

అనంత‌రం, సంగం డెయిరీ విష‌యంలో ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవోను ర‌ద్దు చేయాలంటూ సంగం డెయిరీ డైరెక్ట‌ర్లు వేసిన పిటిష‌న్‌పై కూడా విచార‌ణ జ‌రిగింది. సంగం డెయిరీని ప్ర‌భుత్వం అధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవోను హైకోర్టు నిలిపివేసింది. డైరెక్ట‌ర్లు సాధార‌ణ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని తెలిపింది. అంతేకాదు, ఆ డెయిరీ స్థిర‌, చ‌రాస్తులు అమ్మాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల‌ని ఆదేశించింది. డెయిరీపై ఆధిపత్యం డైరెక్ట‌ర్ల‌కే ఉంటుంద‌ని తెలిపింది. త‌దుప‌రి విచార‌ణ‌ను జూన్ 17కు వాయిదా వేస్తున్న‌ట్లు హైకోర్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News