Anthony Fauci: భారత్ లో ఇప్పుడు లాక్ డౌన్ విధించాలి: ఆంటోనీ ఫౌసీ

US expert Anthony Fauci opines India should impose lockdown
  • భారత్ లో కరోనా వ్యాప్తి ఉద్ధృతం
  • 4 లక్షలు దాటిన రోజువారీ కేసుల సంఖ్య
  • లాక్ డౌన్ తప్పనిసరి అన్న అమెరికా నిపుణుడు ఫౌసీ
  • లాక్ డౌన్ విధిస్తేనే వైరస్ సంక్రమణ విచ్ఛిన్నం అవుతుందని వెల్లడి
భారత్ లో ఇవాళ కూడా 4 లక్షలకు పైగా కొత్త కేసులు వెల్లడి కావడం దేశంలో కరోనా సంక్షోభ తీవ్రతను చాటుతోంది. దీనిపై అమెరికా అంటువ్యాధుల నియంత్రణ నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌసీ స్పందించారు. భారత్ లో పరిస్థితి మరింత చేయిదాటకముందే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దేశంలో వెంటనే మూడ్నాలుగు వారాల పాటు లాక్ డౌన్ విధించాలని అన్నారు. వైరస్ సంక్రమణను విచ్ఛిన్నం చేయాలంటే లాక్ డౌన్ తప్పదని డాక్టర్ ఫౌసీ అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన వద్దని హితవు పలికారు.

దేశవ్యాప్తంగా తాత్కాలిక ఆసుపత్రులు, కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ ఇవ్వాలని, వ్యాక్సిన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని పేర్కొన్నారు. వీలైనన్ని ఎక్కువ కంపెనీలు వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయాలని అన్నారు.

కష్టకాలంలో ఇతర దేశాలకు భారత్ అండగా నిలిచిందని, ప్రస్తుతం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న భారత్ కు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలవాలని సూచించారు. భారత్ కు వైద్య పరికరాలు అందించడమే కాదు, వైద్య సిబ్బందిని కూడా పంపాలని సలహా ఇచ్చారు.
Anthony Fauci
Lockdown
India
Corona Crisis

More Telugu News