Sensex: వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 257 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 98 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
- 2.62 శాతం పెరిగిన బజాజ్ ఫిన్ సర్వ్ షేర్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. మెటల్ షేర్లతో పాటు, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, భారతి ఎయిర్ టెల్, ఐటీసీ వంటి బ్లూ చిప్ కంపెనీల షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 257 పాయింట్లు లాభపడి 49,206కి చేరుకుంది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 14,823 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (2.62%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.52%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.46%), ఎన్టీపీసీ (2.19%), భారతి ఎయిర్ టెల్ (1.73%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఆటో (-2.00%), బజాజ్ ఫైనాన్స్ (-0.90%), ఇన్ఫోసిస్ (-0.60%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.40%), టైటాన్ కంపెనీ (-0.23%).