Nara Lokesh: కర్నూలు జిల్లాలో టీడీపీ నేత హత్య... తీవ్రస్థాయిలో స్పందించిన లోకేశ్

Lokesh furious over YSRCP leaders after TDP leader killed in Kurnool district
  • కురవ శ్రీనివాసులు అనే టీడీపీ నేత హత్య
  • వైసీపీ రౌడీలే చంపారన్న లోకేశ్
  • ఫ్యాక్షన్ మూర్ఖుడ్ని చూసి రెచ్చిపోతున్నారని ఆగ్రహం
  • వైసీపీ రౌడీ మూకలకు చిప్పకూడు ఖాయమని హెచ్చరిక
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో నిడ్జూరు గ్రామానికి చెందిన టీడీపీ నేత కురవ శ్రీనివాసులును అత్యంత దారుణంగా హత్య చేశారంటూ నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తమ బెదిరింపులకు లొంగలేదని వైసీపీ రౌడీలు కిరాతకంగా అంతమొందించారని ఆరోపించారు. ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న మూర్ఖుడ్ని చూసి రెచ్చిపోతున్న వైసీపీ రౌడీ మూకలకు చిప్పకూడు ఖాయమని లోకేశ్ హెచ్చరించారు.

ఫ్యాక్షన్ ను నమ్ముకున్నవాడు ఫ్యాక్షన్ లోనే పోతాడని జగన్ కు మరోసారి గుర్తు చేస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలను హత్య చేయించి తాడేపల్లి కొంపలో రాక్షసానందం పొందుతున్న జగన్ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. జగన్ హత్యారాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నానని, కురవ శ్రీనివాసులు కుటుంబానికి టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
TDP Leader
Murder
Kurnool District
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News