Amararaja: అమరరాజా పరిశ్రమలో కార్యకలాపాలు పునఃప్రారంభం

Amararaja returns to production after high court stays pollution council orders

  • ఇటీవల అమరరాజా పరిశ్రమకు తాత్కాలిక బ్రేక్
  • ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు
  • హైకోర్టును ఆశ్రయించిన అమరరాజా యాజమాన్యం
  • కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులపై హైకోర్టు స్టే
  • నిన్నటి నుంచి అమరరాజా యూనిట్లలో కార్యకలాపాలు

ఇటీవల ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వుల నేపథ్యంలో తాత్కాలికంగా మూతపడిన అమరరాజా పరిశ్రమ తిరిగి ప్రారంభమైంది. కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేయడంతో అమరరాజా కార్యకలాపాల కొనసాగింపునకు మార్గం సుగమమైంది. పరిశ్రమ తిరిగి ప్రారంభమైందని కంపెనీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. చిత్తూరు జిల్లా నూనెగుండ్లపల్లి, కరకంబాడి యూనిట్లలో ఉత్పత్తి కార్యకలాపాలు మే 8వ తేదీన పునఃప్రారంభం అయినట్టు అమరరాజా యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.

పర్యావరణ, భద్రత మరియు ఆరోగ్య వ్యవస్థలకు అత్యధిక ప్రాధాన్యత కొనసాగిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సహకరించి ఏ విధమైనటువంటి సమస్యలనైనా పరిష్కరించే దిశలో సంస్థ తరపున కార్యాచరణ ఉంటుందని ఆ ప్రకటనలో వివరించారు. గత కొద్దిరోజులుగా ఉన్న తాత్కాలిక అంతరాయం వల్ల కంపెనీ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం లేదని, సంస్థ ఉత్పత్తులను యథావిధిగా అందించగలమని భాగస్వాములందరికీ హమీ ఇచ్చింది.

  • Loading...

More Telugu News