CPI Ramakrishna: అమరావతిలో చేసిన అభివృద్ధి అంతా బూడిదలో పోసిన పన్నీరైంది: సీపీఐ రామకృష్ణ
- ఏపీ ప్రభుత్వంపై రామకృష్ణ ధ్వజం
- వైసీపీ వచ్చాక అభివృద్ధి శూన్యమని కామెంట్
- గంగవరం పోర్టులో ఏపీ వాటా అమ్మేస్తున్నారని ఆరోపణ
- అమరావతి నిర్మాణాన్ని ఆపేశారని వ్యాఖ్యలు
వైసీపీ ప్రభుత్వ పాలనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యం అని అన్నారు. గంగవరం పోర్టులో ఏపీ వాటాను అమ్మేందుకు రాష్ట్ర సర్కారు ప్రయత్నాలు ప్రారంభించిందని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో అమరావతి నిర్మాణాన్ని జగన్ అర్థాంతరంగా ఆపేశారని రామకృష్ణ విమర్శించారు.
దీంతో అమరావతిలో చేసిన అభివృద్ధి అంతా బూడిదలో పోసిన పన్నీరైందని విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు విశాఖను కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న పరిశ్రమలను మూసివేసే విధానాలను అవలంబిస్తున్నారని మండిపడ్డారు.