Chhattisgarh: మందుబాబులకు కిక్కెక్కించే వార్తను అందించిన చత్తీస్ గఢ్ ప్రభుత్వం.. మద్యం హోమ్ డెలివరీకి అనుమతి!

Liquor home delivery in Chhattisgarh

  • లాక్ డౌన్ కారణంగా బందైన వైన్ షాపులు
  • ఉదయం 9 నుంచి రాత్రి 8 వరకు మద్యం హోమ్ డెలివరీ
  • ఆన్ లైన్లో మందు బుక్ చేసుకుంటే మందు హోమ్ డెలివరీ

మందుబాబులకు చత్తీస్ గఢ్ ప్రభుత్వం కిక్కెక్కించే వార్తను అందించింది. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో మద్యం షాపులు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో మందు దొరక్క మద్యపాన ప్రియులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో, మద్యాన్ని హోమ్ డెలివరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. మద్యం అందుబాటులో లేకపోవడంతో కల్తీ మద్యం తయారవుతోందని... దాన్ని తాము అడ్డుకోవడంతో జనాలు శానిటైజర్లు తాగి చనిపోతున్నారని ఎక్సైజ్ అధికారి ఒకరు తెలిపారు. అందుకే మద్యాన్ని హోమ్ డెలివరీ చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని చెప్పారు.

చత్తీస్ గఢ్ లో ఈ రోజు నుంచి మద్యం హోమ్ డెలివరీ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు హోమ్ డెలివరీ ఉంటుందని సదరు అధికారి తెలిపారు. ఆన్ లైన్లో ఆర్డర్ చేసి, డబ్బులు చెల్లిస్తే... సమీపంలోని వైన్ షాపు నుంచి మద్యాన్ని డెలివరీ చేస్తారని చత్తీస్ గఢ్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో మందుబాబులు ఖుషీ అవుతున్నారు.

  • Loading...

More Telugu News