Sun TV: కొవిడ్ సహాయ చర్యలకు రూ.30 కోట్ల భారీ విరాళం ప్రకటించిన సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం

Sun TV donates huge amount for covid relief measures in country

  • భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి
  • లక్షల్లో కొత్త కేసులు
  • ఆక్సిజన్, ఔషధాలు, వ్యాక్సిన్లకు విపరీతమైన డిమాండ్
  • కేంద్రం, రాష్ట్రాలకు సన్ టీవీ విరాళం
  • కరోనాపై అవగాహన కోసం విస్తృతంగా ప్రచారం చేస్తామని వెల్లడి

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం కొనసాగుతున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్య సంస్థ సన్ టీవీ భారీ విరాళం ప్రకటించింది. దేశంలో కొవిడ్ సహాయచర్యలకు రూ.30 కోట్ల విరాళం ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విరాళాన్ని భారత ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు చేపడుతున్న కొవిడ్ నియంత్రణ, చికిత్స, ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు తదితర అంశాల కోసం అందిస్తున్నట్టు సన్ టీవీ వివరించింది.

సన్ టీవీ అధీనంలోని అన్ని మీడియా విభాగాల ద్వారా కరోనా కట్టడిపై అవగాహన కల్పించేందుకు పూర్తి వనరులను వినియోగించనున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. తద్వారా భారత్ లోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News