SBI: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త... ఇక ఆన్లైన్లోనే మీ ఖాతాను వేరే బ్రాంచికి బదిలీ చేసుకోవచ్చు!
- ట్విట్టర్ట్ వేదికగా వెల్లడించిన ఎస్బీఐ
- కొవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ సేవల వినియోగానికి ప్రోత్సాహం
- వెబ్సైట్, యోనో, యోనో లైట్ యాప్‌లతో ప్రక్రియ పూర్తి
- కొన్ని రోజుల్లోనే ఖాతా బదిలీ
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు శుభవార్త తెలియజేసింది. ఇకపై బ్రాంచిని మార్చుకోవాలనుకంటే బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. బ్యాంకు వెబ్సైట్లోకి వెళ్లి సంబంధిత వివరాలు నింపితే సరిపోతుంది. కొన్ని రోజుల్లోనే మీ ఖాతా కావాల్సిన బ్రాంచికి బదిలీ అయిపోతుంది. కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో ఇంట్లోనే ఉండి బ్యాంకింగ్ సేవల్ని వినియోగించుకునేందుకు ఎస్బీఐ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇదీ ప్రక్రియ..
* ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ onlinesbi.comకి లాగిన్ కావాలి
* పర్సనల్ బ్యాంకింగ్‌పై క్లిక్ చేయండి
* యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌పై క్లిక్ చేయండి
* ఈ-సర్వీస్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
* ట్రాన్స్ఫర్ సేవింగ్స్ అకౌంట్ ఆప్షన్ని ఎంచుకోండి
* యువర్ అకౌంట్ టు బి ట్రాన్స్‌ఫర్డ్ ఆప్షన్ని ఎంపిక చేసుకోండి
* బదిలీ చేసుకోవాల్సిన ఖాతాను సెలెక్ట్ చేసుకోండి
* ఖాతాను బదిలీ చేసుకోవాలనుకుంటున్న బ్రాంచి ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను ఎంటర్ చేయండి
* అన్ని వివరాలు ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ బటన్ని నొక్కండి
* మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ నొక్కండి
* కొన్ని రోజుల్లోనే మీ ఖాతా బదిలీ అయిపోతుంది
ఎస్బీఐకి చెందిన యోనో యాప్, యోనో లైట్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.