Corona Virus: దేశంలో కొత్తగా 3.29 లక్షల మందికి కరోనా నిర్ధారణ
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,92,517
- నిన్న 3,876 మంది మృతి
- మృతుల సంఖ్య మొత్తం 2,49,992
- 17,27,10,066 మందికి వ్యాక్సిన్లు
దేశంలో నిన్న కొత్తగా 3,29,942 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,56,082 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,92,517కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 3,876 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,49,992కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,90,27,304 మంది కోలుకున్నారు. 37,15,221 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 17,27,10,066 మందికి వ్యాక్సిన్లు వేశారు.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 30,56,00,187 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,50,110 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.