America: భారత్‌లో నేటి పరిస్థితికి కారణం తప్పుడు లెక్కలే: అమెరికా

India opened up prematurely says Dr Fauci on corona crisis

  • పరిస్థితిని తక్కువగా అంచనా వేయొద్దని భారత్ అనుభవం చెబుతోంది
  • కరోనా ఖతమైపోయిందని ముందుగానే వ్యవస్థలను తెరిచేశారు
  • వైరస్ ప్రపంచం ఏమూలన ఉన్నా అమెరికాకు ముప్పే

భారత్‌లో నేటి పరిస్థితికి తప్పుడు లెక్కలు, వ్యవస్థలను ముందుగా తెరవడమే కారణమని అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ (ఎన్ఐఏఐడీ) డైరెక్టర్, అధ్యక్షుడు బైడెన్ ముఖ్య సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. తప్పుడు లెక్కలే భారత్ కొంపముంచాయని అభిప్రాయపడ్డారు. కరోనా ఖతమైపోయిందని భావించి వ్యవస్థలను యథేచ్ఛగా తెరిచేశారని అన్నారు.

భారత్‌లోని ప్రస్తుత పరిస్థితులు ఎన్నో అనుభవాలను నేర్పిస్తున్నాయని, ముఖ్యంగా పరిస్థితిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదని భారత్ అనుభవం చెబుతోందని నిన్న సెనేట్‌లోని సంబంధిత కమిటీకి చెప్పారు. ప్రజారోగ్యం పరంగా అవసరమైన సన్నద్ధత గురించి ఈ అనుభవం ద్వారా మనం తెలుసుకోవచ్చని అన్నారు. ప్రపంచంలో ఏమూల ఇలాంటి వైరస్ ఉన్నా అది అమెరికాకూ ముప్పు తెస్తుందని ఫౌచీ అన్నారు.

  • Loading...

More Telugu News