COVID19: సెకండ్ వేవ్ లో యువతకే ముప్పు ఎక్కువ.. ఇదీ ఐసీఎంఆర్ అధిపతి చెబుతున్న కారణం
- యువత బయట తిరగడం వల్లే వారిలో కేసులెక్కువ
- భారత్ లోని కొత్త రకం కరోనా కూడా కారణం
- 40 ఏళ్లు పైబడిన వారిలో తీవ్రమైన పరిణామాలు
కరోనా సెకండ్ వేవ్ లో యువతే ఎక్కువగా దాని బారిన పడుతున్నారని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధిపతి డాక్టర్ బలరాం భార్గవ చెప్పారు. దానికి రెండు ప్రధాన కారణాలని వివరించారు. యువత బయట తిరగడం ఒక కారణమైతే, భారత్ లో వెలుగు చూసిన కొత్త రకం (వేరియంట్) కరోనా మరో కారణమని చెప్పారు.
ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ల మధ్య కరోనా కేసులను పోల్చి చూస్తే వయసు వ్యత్యాసం పెద్దగా లేదని, అయితే, పెద్దవయసు వారితో పోలిస్తే యువతలో కరోనా వ్యాప్తి కొంచెం ఎక్కువగా ఉందని ఆయన వివరించారు. 40 ఏళ్లుపైబడిన వారు మరింత తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటున్నారని చెప్పారు.