cpi infaltion: మూడు నెలల కనిష్ఠానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

CPI Fell to 3 month low

  • 4.29 శాతానికి చేరిన సీపీఐ
  • ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం
  • పుంజుకున్న పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ)
  • కీలక అంశాల మద్దతుతో 22.4% పెరిగిన ఐఐపీ

ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో మూడు నెలల కనిష్ఠానికి చేరి 4.29 శాతానికి చేరింది. మార్చిలో ఇది 5.52 శాతంగానే ఉంది. ఏప్రిల్‌లో ఆహార ఉత్పత్తుల ధరలు 4.87 శాతం నుంచి 2.02 శాతానికి తగ్గాయి. అయితే ఆర్బీఐ నిర్దేశించిన పరిధిలోనే రిటైల్ ద్రవ్యోల్బణం ఉండడం గమనార్హం.

పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) పుంజుకోవడం విశేషం. ఏప్రిల్‌ ఎగుమతుల్లో వృద్ధి, కోర్‌ ఇండెక్స్‌ పుంజుకోవడం, ఉక్కు తయారీ పెరగడం, విద్యుత్తు వినియోగం పెరగడం వంటి కారణాలతో ఐఐపీ 22.4 శాతం మేర పుంజుకుంది. తాజాగా దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల ప్రభావం ఏప్రిల్‌ నెలాఖరున ప్రారంభమైన నేపథ్యంలో గణాంకాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. పైగా అప్పటికీ లాక్‌డౌన్‌లు కూడా లేకపోవడంతో పారిశ్రామిక ఉత్పత్తి సానుకూలంగానే సాగింది.

  • Loading...

More Telugu News