Director Maruthi: టీఎన్నార్ కుటుంబానికి తనవంతు సాయం అందించిన దర్శకుడు మారుతి

Director Maruthi helps TNR family members
  • కరోనాకు బలైన టీఎన్నార్
  • టీఎన్నార్ కుటుంబానికి చిత్ర పరిశ్రమ చేయూత
  • ఇప్పటికే సంపూర్ణేశ్, చిరంజీవి సాయం
  • టీఎన్నార్ భార్య ఖాతాలో రూ.50 వేలు జమ చేసిన మారుతి 
ప్రముఖ సినీ పాత్రికేయుడు, నటుడు టీఎన్నార్ ఇటీవల కరోనాతో మృతి చెందగా, ఆయన కుటుంబానికి సినీ ప్రముఖులు తమవంతు సాయం చేస్తున్నారు. సంపూర్ణేశ్ బాబు (రూ.50 వేలు), మెగాస్టార్ చిరంజీవి (రూ.1 లక్ష) ఇప్పటికే ఆర్థికసాయం అందించారు. తాజాగా దర్శకుడు మారుతి కూడా టీఎన్నార్ కుటుంబ పరిస్థితి పట్ల స్పందించారు. తనవంతుగా రూ.50 వేల ఆర్థికసాయాన్ని టీఎన్నార్ భార్య జ్యోతి బ్యాంకు ఖాతాలో జమ చేశారు.

దీనిపై ట్విట్టర్ లో వివరించారు. టీఎన్నార్ కుటుంబానికి బాసటగా నిలవాల్సిన సమయం అని పేర్కొన్నారు. "టీఎన్నార్... వుయ్ మిస్ యూ. అయితే నీ కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం" అంటూ మారుతి ట్వీట్ చేశారు. అంతేకాకుండా, "లెట్స్ సపోర్ట్ టీఎన్నార్ ఫ్యామిలీ" అనే ప్రచారాన్ని కూడా ముందుకు తీసుకెళ్లారు.
Director Maruthi
TNR
Help
Corona
Tollywood

More Telugu News