Pullur Toll Plaza: పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద అంబులెన్సులను నిలిపేసిన తెలంగాణ పోలీసులు.. ఒకరి మృతి
- పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద వందకు పైగా అంబులెన్సులు
- బతిమాలినా అనుమతించని పోలీసులు
- మృతదేహంతో వెనక్కి మళ్లిన బాధిత కుటుంబ సభ్యులు
లాక్‌డౌన్ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్సులను సరిహద్దుల వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. బాధితులు బతిమాలినా పోలీసులు అంగీకరించడం లేదు. ఫలితంగా హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దులోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద 20 అంబులెన్సులు నిలిచిపోయాయి.
రోగికి అత్యవసరంగా చికిత్స అందించాల్సి ఉందని, దయచేసి విడిచిపెట్టాలని కోరినప్పటికీ పోలీసులు అనుమతించకపోవడంతో ఓ అంబులెన్సులోని రోగి ఈ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో చేసేది లేక రోగి బంధువులు మృతదేహాన్ని తీసుకుని వెనక్కి వెళ్లిపోయారు.
మరోవైపు, పొరుగు రాష్ట్రాల నుంచి చికిత్స కోసం వచ్చే రోగులకు అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక్కడి ఆసుపత్రుల్లో బెడ్ రిజర్వేషన్ ఉంటేనే అనుమతినిస్తామని స్ఫష్టం చేసింది. ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.