Balineni Srinivasa Reddy: రఘురామకృష్ణరాజు ఓ సైకో... జగన్ ఓపికపట్టడంతో ఇన్నాళ్లు రెచ్చిపోయాడు: మంత్రి బాలినేని

Balineni reacts after AP CID officials arrests MP Raghurama Krishna Raju
  • ఏపీ సీఐడీ అధికారుల అదుపులో రఘురామ
  • ఈ సాయంత్రం హైదరాబాదులో అరెస్ట్
  • జగన్ బొమ్మతో గెలిచాడన్న బాలినేని
  • ఉన్మాదిలా మాట్లాడుతున్నాడని ఆగ్రహం
  • చేసిన తప్పులకు శిక్ష తప్పదని వ్యాఖ్యలు
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన అనంతరం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. రఘురామకృష్ణరాజును ఓ సైకో అని అభివర్ణించారు. నాడు ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ కోసం అర్రులు చాచాడని,  జగన్ బొమ్మతో గెలిచి, ఆపై ఉన్మాదిలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

 కానీ జగన్ ఎంతో సహనం పాటించడం వల్లే రఘురామ ఇన్నాళ్లు రెచ్చిపోయాడని వెల్లడించారు. నేరుగా తననే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసినా జగన్ భరించాడని వివరించారు. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అందులో భాగంగానే రఘురామ అరెస్ట్ అని బాలినేని స్పష్టం చేశారు. చేసిన తప్పులకు శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు.
Balineni Srinivasa Reddy
Raghu Rama Krishna Raju
Jagan
Arrest
APCID
YSRCP
Andhra Pradesh

More Telugu News