Facebook: హర్యానాలో అమానుషం.. యువతిపై 25 మంది అత్యాచారం

25 youth Raped young girl in Haryana
  • ఫేస్‌బుక్ ద్వారా యువతితో పరిచయం
  • కలుద్దాం రమ్మంటూ కిడ్నాప్
  • అడవిలోకి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి అత్యాచారం 
హర్యానాలో జరిగిన ఓ అమానుష ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతిపై 25 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పల్వాల్ జిల్లాలో ఈ నెల 3న ఈ ఘటన జరగ్గా బాధితురాలు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.

 బాధిత యువతికి నిందితుడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. స్నేహం మరింత ముదరడంతో కలుద్దామని యువతిని పిలిచి కిడ్నాప్ చేసి రామ్‌గఢ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ రాత్రి స్నేహితులతో కలిసి అత్యాచారానికి తెగబడ్డాడు.  ఉదయం మరోమారు ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బదార్‌పూర్ సరిహద్దు వద్ద వదిలేసి పరారయ్యారు. యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Facebook
Haryana
Gang Rape

More Telugu News