Corona Virus: దేశంలో కరోనా కేసుల తాజా వివరాలు

    Media Bulletin on status of positive cases COVID19 in india

  • కొత్త‌గా 3,26,098 మందికి కరోనా నిర్ధారణ
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,43,72,907
  • మృతుల సంఖ్య 2,66,207
  • 18,04,57,579  మందికి వ్యాక్సిన్లు  

దేశంలో నిన్న‌ కొత్త‌గా 3,26,098 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,53,299 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 3,890 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,66,207కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,04,32,898 మంది కోలుకున్నారు. 36,73,802 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 18,04,57,579  మందికి వ్యాక్సిన్లు వేశారు.
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 31,30,17,193 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 16,93,093 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News