Virat Kohli: క‌రోనా బాధితుల సాయం కోసం ల‌క్ష్యానికి మించి నిధులు సేక‌రించిన కోహ్లీ, అనుష్క!

virushka reached their aim in corona help fund

  • కెట్టో ద్వారా విరాళాల సేక‌ర‌ణ‌
  • ‘ఇన్ దిస్ టుగెదర్’ పేరుతో విరాళాలు
  • ఐదు రోజుల‌లోనే 7 కోట్ల రూపాయ‌లు
  • ఏడు రోజుల్లో రూ.11,39,11,820 నిధులు

క‌రోనా విజృంభ‌ణ‌తో ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోన్న భార‌తీయుల‌కు సాయం అందించేందుకు విరాళాల సేక‌ర‌ణ కోసం భార‌త క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే త‌మ వంతుగా రూ.2 కోట్లు విరాళం ప్రకటించి, సాయం చేసే స్తోమత ఉన్న ప్ర‌తి ఒక్క‌రు విరాళాలు ఇవ్వాల‌ని వారు కోరారు.

కెట్టో స్వ‌చ్ఛంద‌ సంస్థ‌కు విరాళాలు పంపాల‌ని సూచించారు. ‘ఇన్ దిస్ టుగెదర్’ పేరుతో వారు ప్రారంభించిన ఈ విరాళాల సేక‌రణ‌కు మంచి స్పంద‌న వచ్చింది. ఏడు రోజుల‌లో రూ.7 కోట్ల నిధులు సేక‌రించాల‌నే ల‌క్ష్యంతో వారు ప్రారంభించిన ఈ కార్య‌క్ర‌మానికి  ఐదు రోజుల‌లోనే 7 కోట్ల రూపాయ‌లు వ‌చ్చాయి.

దీంతో నిధుల సేక‌ర‌ణ ల‌క్ష్యాన్ని రెండు రోజుల క్రితం ఈ దంప‌తులు రూ.11 కోట్లకు పెంచారు. దీంతో వారం రోజులు ముగిసే సమయానికి ఆ ల‌క్ష్యాన్ని కూడా దాటి రూ.11,39,11,820 నిధులు వ‌చ్చిన‌ట్లు కొహ్లీ తెలిపాడు. ఈ మొత్తాన్ని కరోనా రోగులకు సాయం చేస్తున్న ‌'యాక్ట్  గ్రాంట్స్ అసోసియేషన్'కు అందివ్వాలని వీరు నిర్ణయించుకున్నారు. ఇక తమ పిలుపు మేరకు స్పందించి విరాళాలు ఇచ్చిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు చెబుతున్న‌ట్లు పేర్కొన్నాడు.  విరుష్క తీసుకున్న చొర‌వ‌ను నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.

  • Loading...

More Telugu News