Andhra Pradesh: ఏపీలో కొత్తగా 22,517 కరోనా పాజిటివ్ కేసులు, 98 మరణాలు
- రాష్ట్రంలో ఉద్ధృతంగా కరోనా సెకండ్ వేవ్
- గత 24 గంటల్లో 89,535 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 3,383 కొత్త కేసులు
- అనంతపురం జిల్లాలో 12 మంది బలి
- యాక్టివ్ కేసుల సంఖ్య 2,07,467
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతలో ఏ మార్పు లేదు. విస్తృత స్థాయిలో పాజిటివ్ కేసులు, పెద్ద సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 89,535 కరోనా పరీక్షలు నిర్వహించగా 22,517 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 3,383 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అనంతపురం జిల్లాలో 2,975 కేసులు, చిత్తూరు జిల్లాలో 2,884 కేసులు గుర్తించారు.
అదే సమయంలో 18,739 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 98 మంది మరణించారు. ఒక్క అనంతరం జిల్లాలోనే 12 మంది కరోనాకు బలయ్యారు. ఇతర జిల్లాల్లోనూ అధిక సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి.
ఇక, రాష్ట్రంలో ఇప్పటివరకు 14,11,320 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 11,94,582 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,07,467 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 9,271కి పెరిగింది.