Raghu Rama Krishna Raju: బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన రఘురామకృష్ణరాజు
- కులాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని ఆరోపణలు
- రఘురామపై ఐపీసీ 124-ఏ కింద కేసు నమోదు
- నిన్న అరెస్ట్.. బెయిల్ తిరస్కరించిన హైకోర్టు
- 28 వరకు రిమాండు విధించిన కోర్టు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ బెయిల్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
కులాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన రఘురామకృష్ణరాజుకు సీఐడీ స్పెషల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం తెలిసిందే. ఆయనపై ఐపీసీ 124-ఏ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు కొట్టారని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు ఆరోపించగా, అవి గాయాలు కాదని పోలీసుల తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు.