secunderabad: సొంత రాష్ట్రాలకు తరలిపోతున్న వలస కార్మికులు.. సికింద్రాబాద్-దానాపూర్ రైలు టికెట్లు గంటలోనే ఖాళీ

Migrant labor in Telangana left for own states

  • మూడు రైళ్లూ ఫుల్
  • ఇంకా 541 మందికి వెయిటింగ్ లిస్టులోనే
  • లాక్‌డౌన్ పొడిగింపుపై ఊహాగానాలతో నగరాన్ని వీడుతున్న వలస కార్మికులు
  • యూపీ, బీహార్, బెంగాల్, ఒడిశా వైపు వెళ్లే రైళ్లన్నీ ఫుల్

తెలంగాణలో కరోనా లాక్‌డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇక్కడి వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ముఖ్యంగా బీహార్ వలస కార్మికులు పెద్ద ఎత్తున తిరుగు పయనమవుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న సికింద్రాబాద్-దానాపూర్ రైలు రద్దీని తట్టుకోలేకపోతుండడంతో రైల్వే అధికారులు ఇటీవల మరో రైలు వేశారు. రెండు రైళ్లు ఉన్నా రద్దీ తగ్గకపోవడంతో నేడు మరో రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మూడు రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. నేటి రైలును ప్రకటించిన గంటలోనే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. నేడు బీహార్ వెళ్లనున్న మూడు రైళ్లలోనూ టికెట్లు అయిపోగా, ఇంకా 541 మంది వెయింటింగ్ లిస్టులో ఉండడం గమనార్హం.

తెలంగాణలో ప్రస్తుతం పది రోజులపాటు అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను మళ్లీ పొడిగిస్తారన్న వార్తలకు తోడు, ఉపాధి కరువవడంతో కార్మికులు సొంత రాష్ట్రాలకు తరలివెళ్లిపోతున్నారు. ఫలితంగా బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వైపు వెళ్లే రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. వారం, పది రోజుల ముందే టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ దొరకడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News