Corona Virus: కరోనా ప్రస్తుత పరిస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్

People and Government Became Negligent After First Covid Wave

  • కరోనా సెకండ్ వేవ్ వస్తుందని వైద్యులు హెచ్చరించినా మారలేదు
  • ఇప్పుడు ఒకరినొకరు నిందించుకోవడం వల్ల ఉపయోగం లేదు
  • ప్రభుత్వం మరింత పారదర్శకంగా వ్యవహరించాలి: రామ్ మాధవ్

దేశంలో కరోనా వైరస్ ప్రస్తుత ఉద్ధ‌ృతికి ప్రభుత్వ, ప్రజల నిర్లక్ష్యమే కారణమని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ‘పాజిటివిటీ అన్‌లిమిటెడ్’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కరోనా మొదటి ఉద్ధృతి తర్వాత ప్రజలు, ప్రభుత్వాల్లో నిర్లక్ష్యం పెరిగిపోయిందని, ప్రస్తుత పరిస్థితికి అదే కారణమని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ రాబోతోందని మనకు తెలుసని, మరోవైపు వైద్యులు కూడా హెచ్చరించారని, అయినప్పటికీ మనం నిర్లక్ష్యాన్ని వీడలేదన్నారు.

ప్రస్తుత పరిస్థితికి ఒకరినొకరు నిందించుకోవడం మాని పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారిపై పోరు విషయంలో ప్రభుత్వం మరింత పారదర్శకంగా వ్యవహరించాలని ఆరెస్సెస్ సీనియర్ నేత, బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News