Prakash Raj: అడవి శేష్ కు మామిడికాయలు పంపించిన ప్రకాశ్ రాజ్

Prakash Raj send mangoes to Adavi Sesh
  • ప్రకాశ్ రాజ్ నుంచి అడవి శేష్ కు కానుక
  • సంతోషం వ్యక్తం చేసిన అడవి శేష్
  • ప్రకాశ్ రాజ్ దంపతులకు కృతజ్ఞతలు
  • తన తల్లికి ఈ ఫలాలు ఎంతో ఇష్టమని వెల్లడి
ప్రముఖ దక్షిణాది నటుడు ప్రకాశ్ రాజ్ కు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. హైదరాబాదు శివార్లలో ఉన్న తన ఫాంహౌస్ లో పలు పంటలు పండిస్తుంటారు. షూటింగ్ లేని సమయాల్లో ప్రకాశ్ రాజ్ తన కుటుంబంతో కలిసి ఫాం హౌస్ లోనే సేద దీరుతుంటారు. ఇక అసలు విషయానికొస్తే... తన వ్యవసాయ క్షేత్రంలో కాసిన మామిడికాయలను ప్రకాశ్ రాజ్ టాలీవుడ్ నటుడు అడవి శేష్ కు కానుకగా పంపారు. మామిడికాయలతో పాటు జావా ఆపిల్ పండ్లను కూడా పంపారు.

ప్రకాశ్ రాజ్ వంటి దిగ్గజం నుంచి తనకు కానుక రావడం పట్ల అడవి శేష్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రకాశ్ రాజ్, పోనీ వర్మ దంపతులకు కృతజ్ఞతలు తెలిపాడు. తన తల్లికి ఈ ఫలాలు అంటే ఎంతో ఇష్టం అని అడవి శేష్ వెల్లడించాడు.
Prakash Raj
Adavi Sesh
Mangoes
Java Apples
Tollywood

More Telugu News