Uttarakhand: ఉత్తరాఖండ్‌లో చిన్నారులపై కరోనా పంజా.. పది రోజుల్లో 1000 మందికిపైగా చిన్నారులకు సోకిన వైరస్

1000 Children Below 9 Years Of Age Had Covid In Last 10 Days In Uttarakhand

  • ఏడాదిలో 2,131 మంది చిన్నారులకు వైరస్ సంక్రమించిందన్న ప్రభుత్వం
  • ఏప్రిల్ తొలి రెండు వారాల్లో 264 మంది చిన్నారులకు సోకిన వైరస్
  • ఆ తర్వాతి నుంచి ప్రతి 15 రోజులకు వెయ్యి దాటిపోతున్న కేసులు

కరోనా సెకండ్ వేవ్ పిల్లలపై పంజా విసురుతోంది. ఉత్తరాఖండ్‌లో పది రోజుల్లో ఏకంగా వెయ్యిమందికిపైగా చిన్నారులు కరోనా బారినపడడం ఆందోళన రేకెత్తిస్తోంది. బాధిత చిన్నారులందరూ 9 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. చిన్నారుల్లో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఏప్రిల్ 1-15 మధ్య 264 మంది చిన్నారులకు కరోనా సంక్రమించింది. ఆ తర్వాత వ్యాప్తి క్రమంగా పెరిగింది. ఏప్రిల్ 16-30 మధ్య 1,053 మందికి వైరస్ సోకింది. ఈ నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య మరో 1,618 మంది చిన్నారులు ఈ మహమ్మారి బారినపడినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ప్రభుత్వం మాత్రం గత ఏడాది కాలంలో 2,131 మంది చిన్నారులు కరోనా బారినపడ్డారని చెబుతోంది.

దేశవ్యాప్తంగానూ చిన్నారుల్లో కరోనా కేసులు పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. కాగా, ఇప్పటి వరకు 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే మన దేశంలో టీకా అందుబాటులో ఉంది. ప్రస్తుతం పలు సంస్థలు చిన్నారులపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. అవి విజయవంతమైతే 18 ఏళ్ల లోపు వారికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.

  • Loading...

More Telugu News