Gorantla Butchaiah Chowdary: రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ కనుమరుగు
- ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు
- ఇదేనా పరిపాలన చెయ్యడం అంటే? అన్న బుచ్చయ్య
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. 'రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ కనుమరుగు అయింది. ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇదేనా పరిపాలన చెయ్యడం అంటే? భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14 ని కాల రాస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది' అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.
'కక్ష సాధింపుపై పెట్టిన శ్రద్ధ ప్రజల ప్రాణాలు కాపాడటంలో పెట్టాలని సీఎం వైఎస్ జగన్ కు దేవినేని ఉమా మహేశ్వరరావు సూచించారు. 'కరోనా వైద్యానికి దూరంగా పల్లె ప్రజలు. పదుల సంఖ్యలో కేసులు. రాష్ట్రంలో అనేక పల్లెలు కరోనాతో తల్లడిల్లుతున్నాయి. 24 గంటల్లో 24,171 కేసులు. రోజుకు 100 పైన మరణాలు నెలలోఇది రెండోసారి. పాజిటివిటీ రేటు పైపైకి పోతుంది. కక్ష సాధింపుపై పెట్టిన శ్రద్ధ ప్రజల ప్రాణాలు కాపాడటంలో పెట్టండి వైఎస్ జగన్' అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.