Sajjanar: ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: సజ్జనార్‌

Everyone should be careful says Sajjanar

  • అందరి మంచి కోసమే లాక్ డౌన్  
  • అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు
  • కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి

మనందరి మంచి కోసమే ప్రభుత్వం లాక్ డౌన్ విధించిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకూడదని సూచించారు. సెకండ్ వేవ్ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

 సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 5 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఎస్సీఎస్సీతో కలిసి త్వరలోనే ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని సుచిత్ర, ఆల్విన్ కాలనీ, గోల్నాక క్రాస్ రోడ్స్, దూలపల్లి క్రాస్ రోడ్స్ ప్రాంతాల్లో ఈరోజు ఆయన పర్యటించారు. రోడ్లపై ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను పరిశీలించారు. వాహనాల కదలికలను వ్యక్తిగతంగా సమీక్షించారు. ఆయనతో పాటు ట్రాఫిక్ డీసీపీ విజయకుమార్, హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్ పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News