Curfew: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం

curfew extends in  ap

  • కరోనాతో అనాథ‌లైన పిల్ల‌ల‌ను ఆదుకునేందుకు చ‌ర్య‌లు
  • ఆర్థిక సాయంపై కార్యాచ‌ర‌ణ రూపొందిస్తాం
  • క‌నీసం నాలుగు వారాలు క‌ర్ఫ్యూ ఉంటేనే స‌రైన ఫ‌లితాలు
  • గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెర‌గ‌కుండా చ‌ర్య‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోన్న నేప‌థ్యంలో క‌ర్ఫ్యూను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ... ఏపీలో క‌ర్ఫ్యూ విధించి 10 రోజులు మాత్ర‌మే అవుతోంద‌ని చెప్పారు. క‌నీసం నాలుగు వారాలు క‌ర్ఫ్యూ ఉంటేనే స‌రైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ఆయ‌న తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కరోనాతో అనాథ‌లైన పిల్ల‌ల‌ను ఆదుకునేందుకు చ‌ర్య‌లు తీసు‌కుంటామ‌ని,వారికి ఆర్థిక సాయంపై కార్యాచ‌ర‌ణ రూపొందిస్తామ‌ని చెప్పారు. కాగా, ఏపీలో క‌ర్ఫ్యూ విధించిన‌ప్ప‌టికీ కొవిడ్ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News