ABN: ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏబీఎన్, టీవీ5

ABN and TV5 files petition in Supreme Court against AP Government

  • రఘురాజు వ్యవహారంలో ఈ రెండు చానళ్లపై రాజద్రోహం కేసు నమోదు
  • ఉద్దేశ పూర్వకంగా తమను ఎఫ్ఐఆర్ లో చేర్చారని వ్యాఖ్య
  • సీఐడీ దర్యాప్తుపై స్టే విధించాలని కోర్టుకు విన్నపం

ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో తమపై ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసును నమోదు చేయడంపై తెలుగు న్యూస్ చానళ్లు ఏబీఎన్, టీవీ5 సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రఘురాజు విద్వేష వ్యాఖ్యలను ప్రసారం చేశామంటూ తమపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారని పిటిషన్లలో పేర్కొన్నాయి. ఉద్దేశ పూర్వకంగానే తమను ఎఫ్ఐఆర్ లో చేర్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. తమ సంస్థపై, తమ ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరాయి. సీఐడీ దర్యాప్తుపై స్టే విధించాలని విన్నవించాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News